Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

లైవ్ రిపోర్టింగ్

రిపోర్టర్ పృథ్వి రాజ్

అన్ని సమయాలు యుకె ఆధారంగా పేర్కొనబడ్డాయి

  1. నేటి ముఖ్యాంశాలు

    దేశంలో త్వరలో జనాభా నియంత్రణ చట్టం తేబోతున్నట్లు కేంద్ర ఆహార శుద్ధి మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు.

    రష్యాతో యుద్ధం చేస్తున్న యుక్రెయిన్‌కు సాయంగా అధునాతన రాకెట్ వ్యవస్థలను పంపించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.

    కోల్‌కతాలో మంగళవారం అర్ధరాత్రి హఠాత్తుగా చనిపోయిన ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కేకే (53) ఉదంతంలో పోలీసులు అసహజ మరణం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    రష్యా తమ మీద యుద్ధానికి దిగినప్పటి నుంచీ యుక్రెయిన్‌లో 15,000 కు పైగా అనుమానిత యుద్ధ నేరాల ఫిర్యాదులు వచ్చాయని యుక్రెయిన్ చీఫ్ ప్రాసిక్యూటర్ ఇరీనా వెనెడిక్టోవా చెప్పారు.

    పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుండి ఈ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.

    గోదారి గట్టున ల్యాప్‌టాప్‌లతో కుస్తీ.. చెట్ల కింద.. బైకుల మీద.. సిగ్నల్‌ కోసం పాట్లు.. కోనసీమలోని 16 మండలాల్లో ప్రస్తుత పరిస్థితి ఇది. ఇక్కడ ఇంటర్నెట్‌పై ఆంక్షలు అమలవుతున్నాయి.

    భారతీయ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బుధవారం చేసిన ట్వీట్ పలు ఊహాగానాలకు దారి తీస్తోంది.ఆయన రాజకీయాల్లోకి అడుగు పెడతారేమోననే ఊహాగానాలు చేస్తున్నారు.

    అవినీతి నిరోధకం కోసమంటూ ఏపీ ప్రభుత్వం కొత్త యాప్ ని ప్రవేశపెట్టింది. ‘ఏసీబీ 14400’ పేరుతో మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ యాప్ ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు.

    రానున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ నగరంలో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించనుందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన ఒక మనీ లాండరింగ్ కేసులో జూన్ 8వ తేదీన విచారణకు హాజరు కావలసిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.

    ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని గురు నానక్ కాలనీలో బుధవారం తెల్లవారుజామున ఓ ఫుట్‌బాల్ ఆటగాడు హత్యకు గురయ్యాడు. గుణదల ప్రాంతంలోని కొందరు దండుగులు ఈ హత్యకు పాల్పడినట్టు పటమట పోలీసులు అనుమానిస్తున్నారు.

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్ల కోసం ఈ లింకును క్లిక్ చేయండి.

  2. విద్యకు సంబంధించిన యాప్‌ను లాంచ్ చేసినట్లు సౌరవ్ గంగూలీ ప్రకటన

    సౌరవ్ గంగూలీ చేసిన ట్వీట్ పై వచ్చిన స్పందనలకు, పుకార్లకు చెక్ పెడుతూ ఒక ప్రకటన చేశారు.

    ప్రపంచవ్యాప్తంగా పని చేసే విద్యకు సంబంధించిన యాప్‌ను లాంచ్ చేసినట్లు సౌరవ్ గంగూలీ ప్రకటించినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ పేర్కొంది.

    View more on twitter
  3. Video content

    Video caption: తిరుమలకు వెళ్తున్నారా.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

    పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుండి ఈ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.

  4. Video content

    Video caption: కోనసీమలో ఇంటర్నెట్ బంద్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల తిప్పలు..

    గోదారి గట్టున ల్యాప్‌టాప్‌లతో కుస్తీ.. చెట్ల కింద.. బైకుల మీద.. సిగ్నల్‌ కోసం పాట్లు.. కోనసీమలోని 16 మండలాల్లో ప్రస్తుత పరిస్థితి ఇది. ఇక్కడ ఇంటర్నెట్‌పై ఆంక్షలు అమలవుతున్నాయి.

  5. ఊహాగానాలకు దారి తీస్తున్న సౌరవ్ గంగూలీ ట్వీట్

    భారతీయ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బుధవారం చేసిన ట్వీట్ పలు ఊహాగానాలకు దారి తీస్తోంది.

    ఆయన రాజకీయాల్లోకి అడుగు పెడతారేమోననే ఊహాగానాలు చేస్తున్నారు. గంగూలీ చేసిన ట్వీట్ లో ఆయన భవిష్య ప్రణాళికల గురించి స్పష్టంగా చెప్పలేదు. కానీ, ఆయన చేయబోయే పని ప్రజలకు ఉపయోగపడుతుందని మాత్రం పేర్కొన్నారు.

    View more on twitter

    "1992లో మొదలైన నా క్రికెట్ ప్రయాణానికి 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. అప్పటి నుంచి క్రికెట్ నాకు చాలా ఇచ్చింది. ముఖ్యంగా మీ అందరి సహకారం లభించింది. ఈ స్థానానికి చేరేందుకు నా ప్రయాణంలో నాకు సహకరించిన, మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా మందికి సహాయపడే విధంగా ఉండే ఒక కొత్త పనిని మొదలుపెట్టాలని అనుకుంటున్నాను. జీవితంలో ఈ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో మీరందరూ మునుపటి మాదిరిగానే నాకు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను" అని అంటూ సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశారు.

    అయితే, సౌరవ్ గంగూలీ బీసీసీఐ పదవికి రాజీనామా చేయలేదని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా ఏఎన్‌ఐకి చెప్పారు.

  6. మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌లను కలిసిన ప్రధాని మోదీ

    ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలను గెలుచుకున్న మహిళా బాక్సర్లను భారత ప్రధాని మోదీ బుధవారం కలిశారు.

    ప్రధాని కలిసిన వారిలో నిఖత్ జరీన్, మనీషా మౌన్, పర్వీన్ హూడా ఉన్నారు.

    View more on twitter
  7. యూత్ అఫైర్స్ మంత్రి ఆనీ అలీ

    ఆస్ట్రేలియాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. తొలి ముస్లిం మహిళా మంత్రిగా ఎన్నికైన ఆనీ అలీ ఖురాన్ చేతిలో పట్టుకుని ప్రమాణ స్వీకారం చేశారు. ఆనీ అలీ ఎవరు?

    మరింత చదవండి
    next
  8. నటాలీ షెర్మన్

    బీబీసీ ప్రతినిధి, న్యూ యార్క్

    పెర్మియన్ బేస్ ఆయిల్ ఫీల్డ్

    జో బైడెన్ తన ఎన్నికల ప్రచారంలో వాతావరణ మార్పులను అరికట్టడాన్ని ఒక ముఖ్యమైన అంశంగా ఎంచుకున్నారు. కానీ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం పెట్టుబడులు పెట్టాలంటూ పిలుపునివ్వడంతో ఆయన గతంలో చేసిన భారీ పర్యావరణ ప్రతిపాదనలకు ఆటంకం ఏర్పడుతోందా?

    మరింత చదవండి
    next
  9. మందగించిన భారత ఆర్థిక వృద్ధి రేటు

    మందగించిన ఆర్థిక వృద్ధి రేటు
  10. వైఎస్ జగన్: ‘అవినీతిని ఏరిపారేస్తాం..లంచం అడిగితే యాప్‌లోరికార్డ్ చేయండి’

    వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

    వైఎస్ జగన్ అవినీతి యాప్

    అవినీతి నిరోధకం కోసమంటూ ఏపీ ప్రభుత్వం కొత్త యాప్ ని ప్రవేశపెట్టింది. ‘ఏసీబీ 14400’ పేరుతో మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ యాప్ ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో అవినీతిని అరికట్టేందుకు ఇది ఉపయోగపపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    "అధికారంలో వచ్చిన నాటి నుంచి అవినీతిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.1.41లక్షల కోట్ల మొత్తాన్ని లాంటి అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా పంపించాం" అంటూ సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

    ఈ యాప్ ని ఉపయోగించి అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అవినీతి నిరోధానికి ఇదో విప్లవాత్మక మార్పు అంటూ వ్యాఖ్యానించారు. అవినీతి లేని పాలన అందించడమే తమ లక్ష్యం అన్నారు

    "ఇక నుంచి ఎక్కడైనా, ఎవరైనా కూడా.. కలెక్టరేట్‌ అయినా, ఆర్డీఓ కార్యాలయం అయినా, సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు అయినా, మండల కార్యాలయం అయినా, పోలీస్‌స్టేషన్‌ అయినా, వాలంటీర్, సచివాలయం, 108, 104 సర్వీసులు అయినా.. ఎవరైనా ఎక్కడైనా కూడా లంచం అడిగితే.. ఎవరైనా చేయాల్సింది ఒక్కటే... తమ చేతుల్లోని ఫోన్‌లోకి ఏసీబీ 14400 యాప్‌ను డౌన్లోడ్‌ చేసి... బటన్‌ ప్రెస్‌చేసి వీడియోద్వారా కాని, ఆడియోద్వారా కాని సంభాషణను రికార్డు చేయండి.. ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుంది" అంటూ ఆయన వివరించారు.

    వైఎస్ జగన్ అవినీతి యాప్

    యాప్ పనిచేసే విధానం..

    • సీఎంవో అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం..
    • గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
    • త్వరలో ఐఓఎస్‌ వెర్షన్‌లోనూ యాప్‌ను సిద్ధంచేస్తున్నారు.
    • యాప్‌ డౌన్లోడ్‌ చేయగానే మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ
    • ఓటీపీ రిజిస్టర్‌ చేయగానే వినియోగానికి యాప్‌ సిద్ధమవుతుంది.
    • యాప్‌లో 2 కీలక ఫీచర్లు ఉంటాయి.
    • యాప్‌ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలనునేరుగా లైవ్‌రిపోర్ట్‌ ఫీచర్‌ను వాడుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.
    • లాడ్జ్‌ కంప్లైంట్‌ ఫీచర్‌ ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించి.. ఫిర్యాదుకుతనదగ్గరున్న డాక్యుమెంట్లను, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించే అవకాశం కుడా అందుబాటులో ఉంది.
    • ఫిర్యాదు రిజిస్టర్‌ చేయగానే మొబైల్‌ ఫోన్‌కు రిఫరెన్స్‌ నంబరు
    • ఆ నంబర్ ఆధారంగా కంప్లైంట్ స్టేటస్ అప్ డేట్ అవుతుంది.
  11. మన రాజులు, చక్రవర్తుల గురించి పుస్తకాల్లో రెండు లైన్లే రాశారు: అక్షయ్ కుమార్

    అక్షయ్ కుమార్

    బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్’ హిందీ సినిమా జూన్ 3వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమాకు డాక్టర్ చంద్ర ప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించారు.

    ఈ సినిమా ప్రొమోషన్‌లో భాగంగా ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్‌కుమార్ మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తూ పృథ్వీరాజ్ చౌహాన్ గురించి పాఠ్యపుస్తకాల్లో రెండు మూడు వాక్యాలు మాత్రమే రాశారని అభిప్రాయపడ్డారు.

    ‘‘ఆక్రమణదారుల గురించి చాలా రాశారు. కానీ మన రాజులు, చక్రవర్తులు ఒక్కొక్కరి గురించి రెండు లైన్లు మాత్రమే రాశారు. పృథ్వీరాజ్ గురించి చంద్రప్రకాష్ నాకు చెప్పటం మొదలుపెట్టినపుడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయని నాకు అర్థమైంది. ఈ విషయాలన్నీ నిజమే కదా, కల్పితం కాదు కదా అని నేను ఆయనను అడిగాను. ఆయన నాకు మొత్తం చెప్పారు’’ అని అక్షయ్ పేర్కొన్నారు.

    ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తన ఇంటర్వ్యూ గురించి కూడా అక్షయ్ ప్రస్తావించారు. ఒక సామాన్య పౌరుడిగా తను ప్రధానిని ప్రశ్నించినట్లు చెప్పారు. ‘‘ప్రధాని ఏ వాచీ ధరిస్తారనేది తెలుసుకోవాలని నేను కోరుకున్నా. విధానం గురించి ప్రధానితో మాట్లాడే పని నాది కాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

    ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ రాసో, ఇతర జానపద గేయాల సాయం తీసుకున్నట్లు చంద్ర ప్రకాష్ ద్వివేది చెప్పారు. ఈ సినిమాకు చాలా కాలం వరకూ నిర్మాత ఎవరూ దొరకలేదని తెలిపారు.

    View more on twitter
  12. మోదీ, బైడెన్

    ‘‘దక్షిణ కొరియా, ఇండియా, సింగపూర్ ఈ ఫ్రేమ్‌వర్క్‌లో చేరడం గురించి డైలమాలో ఉన్నాయి. ఎందుకంటే ఈ ఒప్పందం 'చైనాను నియంత్రించేలా' కనిపించాలని అవి కోరుకుంటున్నాయి’’ అని రిపోర్ట్ పేర్కొంది.

    మరింత చదవండి
    next
  13. జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ

    నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన

    రానున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ నగరంలో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించనుందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఏఎన్ఐ కథనం ప్రకారం.. రెండు రోజుల పాటు జరిగే ఈ భేటీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా బీజేజీ జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు.

    సాధారణంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కోవిడ్ ఆంక్షల వల్ల కొంత కాలంగా జరగలేదు. 2021 నవంబర్‌లో దిల్లీలో జరిగిన కార్యవర్గ భేటీ అనంతరం మళ్లీ ఈ ఏడాది జూలైలో హైదరాబాద్‌లో ఈ భేటీ జరుగబోతోంది.

    రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలు, వ్యూహాల గురించి, సంస్థాగత వృద్ధి, 2024 సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధత తదితర అంశాలపై ఈ సమావేవంలో చర్చించనున్నారు.

    నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన

    అయితే.. 2023 చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తెలంగాణలో దూకుడుగా ముందుకెళుతున్న బీజేపీ.. తన జాతీయ కార్యవర్గ సమావేశానికి వేదికగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను ఎంచుకోవటం చాలా ముఖ్యమైన కీలకమైన అంశం.

    ఇటీవల తెలంగాణలో ఒక బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని మోదీ.. రాష్ట్రంలో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌ది రాచరిక కుటుంబ పాలన అంటూ విమర్శించారు.

    బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కూడా ఇటీవల తెలంగాణ పర్యటనల్లో కేసీఆర్ పాలనను విమర్శిస్తూ.. తెలంగాణ మార్పు కోసం చూస్తోందని, బీజేపీకి ఒక అవకాశం ఇవ్వవచ్చునని పేర్కొన్నారు.

    మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు కూడా కేంద్ర ప్రభుత్వం మీద, ప్రధానమంత్రి మీద తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నారు. బీజేపీ యేతర, కాంగ్రెసేతర కూటమిని ఏర్పాటు చేయటానికి ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పలువురు నేతలతో భేటీ అవుతున్నారు.

  14. మెరిల్ సెబాస్టియన్

    బీబీసీ న్యూస్

    అధీలా నస్రీన్, ఫాతిమా నూరా

    కేరళకు చెందిన స్వలింగ సంపర్క జంట సహజీవనం చేసేందుకు కోర్టు అనుమతి లభించింది. కానీ, తమ కుటుంబాల వల్ల మాత్రం తమకు భయం పొంచి ఉందని ఈ జంట అంటున్నారు.

    మరింత చదవండి
    next
  15. సురేఖ అబ్బూరి

    బీబీసీ ప్రతినిధి

    విశ్వనాథ కాలనీ సర్పంచ్ అనిత

    ‘‘సర్పంచ్ బరిలో ఉన్న మిగతా నలుగురి కంటే నా పైనే ఊర్లో వాళ్లు నమ్మకం పెట్టుకొని గెలిపించారు. అందుకే ఊరికి అభివృద్ధి పనులు చేయాలి అన్న బాధ్యత మీద వేసుకున్నాను. రూ.11లక్షల వరకు అప్పు చేసి గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేయించాను''

    మరింత చదవండి
    next
  16. బ్రేకింగ్ న్యూస్సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు

    సోనియా గాంధీ, రాహుల్ గాంధీ

    నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన ఒక మనీ లాండరింగ్ కేసులో జూన్ 8వ తేదీన విచారణకు హాజరు కావలసిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.

    ఈ విషయంలో తమ పార్టీ తల వంచబోదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా, పార్టీ సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీలు బుధవారం విలేకరలు సమావేశంలో పేర్కొన్నారు.

    ‘‘ముఖ్యమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించటంలో నిష్నాతమైన మోదీ ప్రభుత్వం పిరికితనంతో కుట్ర పన్నింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రధానమంత్రి మోదీ ఈడీ ద్వారా సమన్లు పంపించారు. ఈడీ డైరెక్టర్ భయపడుతున్నారన్నది స్పష్టం. ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో వైఫల్యాలను దాచి పెట్టటానికి, దేశాన్ని తప్పుదోవ పట్టించటానికి చేస్తున్న ప్రయత్నమిది’’ అని వారు విమర్శించారు.

    View more on twitter

    ‘‘ఇది అత్యంత ఊహాజనిత, కల్పిత ఆరోపణ. హాస్యపూరితం. అధికార పార్టీ తన రాజకీయ ప్రత్యర్థులు ప్రతి ఒక్కరి మీదా దాడి చేస్తోంది. కక్ష సాధింపు కోసం ఇలా చేస్తున్నారు. ఈ కేసులో కోర్టు విచారణ 2014-15 నుంచి కొనసాగుతోంది. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈడీని తీసుకువచ్చారు. డబ్బులు లేని దగ్గర, ఆస్తి బదిలీ లేని దగ్గర మనీ లాండరింగ్ కేసు ఎక్కడి నుంచి వస్తుంది? ఏజేఎల్‌ను బలోపేతం చేయటానికి, దాని మీద ఉన్న అప్పును తొలగించటానికి దానిని ఈక్విటీ కిందకు మార్చటం జరిగింది. ఇది పూర్తిగా చట్టబద్ధమైన పని. దీనిద్వారా వచ్చిన డబ్బును ఉద్యోగుల చెల్లింపుల కోసం ఉపయోగించారు’’ అని అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు.

    View more on twitter
  17. Video content

    Video caption: యుక్రెయిన్‌ యుద్ధంలో సైనికులతో పాటు పౌరుల్ని కూడా రష్యన్లు బందీలుగా తీసుకెళుతున్నారు.

    ఇలా పట్టుబడినవారిలో చాలా మంది తమను ఖైదీల మార్పిడి కింద వదిలేయాలని కోరుతున్నారు.

  18. అమ్రీనా భట్

    కొద్ది వారాలుగా కశ్మీర్ లోయలో మిలిటెంట్లు చేస్తున్న దాడుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అమ్రీనా హత్యకు కొద్ది రోజుల ముందు కశ్మీర్ పండిట్ సముదాయానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిని కాల్చి చంపారు. అలాగే ఒక ప్రభుత్వ మహిళా టీచర్‌ను కూడా చంపేశారు.

    మరింత చదవండి
    next
  19. వాట్సాప్‌లో చిన్నారిని అమ్మకానికి పెట్టిన ఆర్ఎంపీ!

    శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    వాట్సాప్ స్క్రీన్

    మూడు రోజుల పసికందును రూ. 3 లక్షలకు అమ్ముతామంటూ వాట్సాప్‌లో అమ్మకానికి పెట్టిన ఉదంతం కలకలం రేపింది.

    చిన్నారిని అమ్ముతామంటూ ఓ ఆర్‌ఎంపీ చేసిన వాట్సాప్ పోస్ట్ వైరల్ అయ్యింది. చివరకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

    ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకి చెందిన ఆర్‌ఎంపీ అమృతరావు ఓ పసికందును అమ్మేందుకు చేసిన ప్రయత్నాన్ని దిశ పోలీసులు అడ్డుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

    ఆ చిన్నారి ఎవరు, అమ్మకానికి సిద్ధపడడానికి కారణాలపై దర్యాప్తు సాగుతోందని పోలీసులు చెబుతున్నారు.

  20. విజయవాడలో ఫుట్‌బాల్ ఆటగాడి హత్య.. నిందితుల కోసం గాలింపు

    శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    ఆకాష్ (ఫైల్ ఫొటో)
    Image caption: ఆకాష్ (ఫైల్ ఫొటో)

    ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో మరో హత్య జరిగింది. నగరంలోని గురు నానక్ కాలనీలో బుధవారం తెల్లవారుజామున ఓ ఫుట్‌బాల్ ఆటగాడు హత్యకు గురయ్యాడు.

    గుణదాల ప్రాంతంలోని కొందరు దండుగులు ఈ హత్యకు పాల్పడినట్టు పటమట పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పటమట పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

    నగరానికి చెందిన ఆకాష్ ఫుట్‌బాల్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇటీవల స్థానికంగా వివిధ పోటీల్లో రాణిస్తున్నాడు. అయితే ఆకాష్‌తో వివాదానికి దిగిన గుణదల గంగిరెద్దుల దిబ్బ ప్రాంతానికి చెందిన యువకులు ఈ హత్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    ఘటనా స్థలాన్ని పోలీస్ అధికారులు పరిశీలించారు. కొన్ని ఆధారాలు లభించినట్టు చెబుతున్నారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిలాల్ రాణా తెలిపారు.